Thursday, November 19, 2020

మెత్తని గుండ్రాయి - మగతనం !


 పైన చూపించిన ఇమేజులో ఉన్న కొటేషన్ల లాంటివి చిల్లర కోట్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. మగతనం అంటే ఇదీ, అదీ ... అని పేద్ద పెద్ద డయిలాగులు మనం వింటూ ఉంటాం.

సపోజ్ ఇప్పుడు ఒక తెలుగు సినిమా చూసుకోండి. అది మాస్ సినిమా అయితే "మగతనం" ఒకలా ఉంటుంది. క్లాస్ సినిమా అయితే అందులో "మగతనం" మరొకలా ఉంటుంది. తొడలు కొట్టడం, గాల్లోకి ఎగరడం, వంశములో గొప్ప గొప్ప పనులు చేసినోళ్ళు పుట్టి ఉండడం, ఊర్లో ఏ కన్నెపిల్లైనా సరే.. హీరో గుండెల మీద వాలాలి అనే కోరిక కలిగి ఉండడం, వాడికి ఉంపుడు గత్తేగా అయినా సరే ఉండాలి అని సెకండ్ హీరోయిన్లు కలలు కనడం .. ఇలాంటివన్నీ మగతనం కిందకే వస్తాయి మాస్ సినిమాల్లో.
ఇక క్లాస్ సినిమాల్లో, ఆడవారి ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో అయితే బాగా టైలర్ మేడ్, "బోన్సాయి మొక్కలా" ఉంటుంది "మగతనం" అనేది. ఎవరికి కావలసిన విధంగా వాల్లు కొటేషన్లు చెప్పేసుకుంటారు. "ఆడదానికి ఏకష్టం రాకుండా చూసుకోవడం మగతనం అంటే" అని ఒకరు, "ఆడదాని గొప్పతనం తెలిసి ఉండడం, ఆమెను గౌరవించడమే మగతనం" అని ఒకరు... ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం గుర్తుకు రావడం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే మగతనం అనేది "మెత్తని గుండ్రాయిలాగా" ఉండాలి. పేరే గుండ్రాయి, కానీ అది మెత్తగా ఉంటుంది అన్న మాట.
మగాడు కాస్త సున్నితత్వాన్ని అలవరుచుకోవాలి, ఆడవారు కాస్త కఠినత్వాన్ని అలవరుచుకోవాలి అనేది సహేతుకమైన మాటే ! అది అవసరం కూడా. మగవారు కాస్త తగ్గాలి, ఆడవారు కాస్త దృఢంగా తయారు అవ్వాలి. కానీ, ఈ కొటేషన్లూ, సినిమాల్లో కమ్రర్షిలైజ్ అవ్వడం వల్లనో, మన ఫెమినిష్టులూ, వాల్ల మెప్పు పొందాలి అనుకునే వారి వల్లనో శృతి మించి రాగాన పడుతూ ఉంటాయి.
అయినా "మగతనం" ఏమిటీ అని డిసైడ్ చేసేది ఎవ్వరు ? పురుషులా, స్త్రీలా? ఫెమినిష్టులా, కమ్యూనిష్టులా, పురుష హక్కుల కార్యకర్తలు అని చెప్పుకునే జనాలా? ఎవరు ?
నీ మగతనాన్ని నువ్వే డిసైడ్ చేసుకో ! పక్కోళ్ళకి ఆ ఛాన్స్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకు. నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటే అది మగతనం. గుర్తుంచుకో ... నువ్వు డిఫైన్ చేసుకున్న మగతనం మంచా, చెడా, గొప్పదా, ఉన్నత భావాలు కలిగి ఉన్నదా అని అడగడం లేదు. నీ మగతనాన్ని నువ్వు డిసైడ్ చేసుకో అని మాత్రమే అంటున్నా. కాకపోతే, డిసైడ్ చేసుకున్న గొప్పోడీవి నువ్వే కాబట్టి, ఏవన్నా సైడ్ ఎఫెక్టులు వచ్చినా నువ్వే బాధ్యుడివి అని గుర్తు పెట్టుకో. ఫలానా పనికిమాలినోడు చెప్పాడు, వాడి చెప్పింది విని నేను ఇలా అయ్యాను.. నన్ను తిట్టకు.
సపోజ్ ఇప్పుడు ఒకడు, మొక్కలకు నీళ్ళు పోయడం మగతనం అని ఫీలయ్యాడు అనుకోండి. వాడికి సంబందించినంత వరకూ అదే "మగతనం". ఇంకొకడు ఆడవారిని హింసించడం మగతనం అని ఫీలయ్యాడు అనుకోండి. అదే వాడి మగతనం. కానీ, మొక్కలకు నీళ్ళు పోసే వాడికి ఎలాంటి సమస్యా రాకపోవచ్చు (జనాలు వాడి గురించి పట్టించుకోరంతే), కానీ అడవారిని హింసించే వాడు మాత్రం చట్టం నుండి సమస్యలు ఎదుర్కొంటాడు, అది తధ్యం. సో, ఇక్కడ నీ చాయిస్, నీ రెస్పాన్సిబిలిటీ, నీ అకౌంటబిలిటీ అనేవి ఇంపార్టంట్.
Botton Line: Decide yourself. Don't let others do it for you.

1 comment:

  1. మగతనం
    ఆడతనం
    ఎవరిష్టం
    వారిది :) :)

    ReplyDelete