Saturday, August 1, 2020

ఆవో కభీ హవేలీ పే - నా మొదటి నవల !

నాకు రొమాంటిక్ నవల్స్ పెద్దగా నచ్చవు. కేవలం రొమాన్స్ మాత్రమే చదవాలి అంటే చచ్చేంత బోర్ నాకు. అందుకేనేమో, యండమూరిగారు ఎంత నా ఫేవరెట్ రైటర్ అయినా, ఆయన రాసిన "వెన్నెల్లో ఆడపిల్ల" ఇంతవరకూ నేను చదవలేదు. కానీ, ఆయన రాసిన తులసి, తులసీదలం, అష్టావక్ర మాత్రం ఇప్పటి బోలెడు సార్లు చదివాను.

అంటే నాకు రొమాన్సు నచ్చదు అనికాదు, కేవలం రొమాన్సు మాత్రమే ఉండే రొమాంటిక్ నవల్లు పెద్దగా నచ్చవు. పనిపాటా లేకుండా, "ఎ జర్నీ ఇంటు ఎ ఉమన్స్ హార్ట్" అంటూ సాగే నవల్లు నాకు పరమ బోరు కొట్టిస్తాయి. అలా కాకుండా, రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ థ్రిల్లెర్, రొమాంటి హర్రర్ ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో రొమాన్స్ ఒకపార్ట్ మాత్రమే !

నేను రాసే కథ కూడా అంతే. రొమాంటిక్ నవల కాదు. ఇది రొమాంటిక్ హర్రర్ లాంటి కామెడి నవల. అంటే ఇది ఇటీవల తెలుగులో సినిమాలలో బాగా పాపులరైన హర్రర్+కామెడీ జోనరులోకి వస్తుంది. కాకపోతే ఇందులో హర్రర్ ఎక్కువా, కామెడీ ఎక్కువా లేక రొమాన్సు ఎక్కువా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి.

నవల పేరు "ఆవో కభీ హవేలీ పే"

సింపులుగా ఈ కథ గురించి చెప్పేస్తాను. ఒక కుర్రాడు, అతి సాధారణ కుర్రాడు, ఒక రోజు ఒక హవేలీలో చిక్కుకు పోతాడు. అక్కడ అతనికి ఏం జరిగింది ? జీవితములో అతను ఎంతగానో కోరుకున్న ప్రేమ అతనికి అక్కడా ఎలా లభించింది. ఆ ప్రేమ కోసం అతను పడ్డ పాట్లు ఏమిటి అనేదే ఈ కథ.

సింపులుగానే ఉన్నా, ఆల్రెడీ విన్నట్టుగానే ఉన్నా కథ మాత్రం కొత్తగా ఉంటుంది అని చెప్పగలను. కనీసం నేను కొత్తగా రాయడానికి ట్రై చేస్తాను. మొదటి భాగం వీలైనంత తొందరలో పెడతాను.

No comments:

Post a Comment